: తెలంగాణలో మరోసారి ఇంటింటి సర్వే


తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఇంటింటి సర్వే జరగనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు సర్కార్ తెలిపింది. జాతీయ జనాభా నమోదు సంస్థ (ఎన్పీఆర్) డేటా కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ సర్వే నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జిల్లాల్లో ప్రభుత్వాధికారులు ఇంటింటి సర్వేకు సమాయత్తం కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News