: భారతీయ బాలికను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న పాకిస్థానీ
దుబాయ్ లో దారుణం చోటుచేసుకుంది. గొప్పడాన్సర్ అవుదామని భావించిన భారతీయ బాలికను పాకిస్థానీ బాలుడు పొట్టనపెట్టుకున్నాడు. దుబాయ్ లో 14 ఏళ్ల భారతీయ బాలికకు 14 ఏళ్ల పాకిస్థానీ బాలుడు ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. అతని ప్రతిపాదనకు ఆ బాలిక అంగీకరించలేదు. దీంతో సదరు బాలుడు ఆ బాలిక తల్లి విధులకు వెళ్లిపోయిన తరువాత వారి ఫ్లాట్ కు వెళ్లాడు. తరువాత వారి మధ్య జరిగిన వివాదంపై స్పష్టత లేదు. అయితే బాలికను కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత బాలిక మృతదేహంపైన, తన ఒంటిపైన కిరోసిన్ చల్లుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో తను కూడా చనిపోవడంతో బాటు, వారి బెడ్ రూం మొత్తం తగలబడిపోయింది. పోస్టు మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తరువాత కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. బాలిక ప్రముఖ భారతీయ నృత్య బృందంలో సభ్యురాలని, గొప్ప డాన్సర్ అవుదామని భావించేదని అక్కడి వారు తెలిపారు.