: బంజారాహిల్స్ లో ఉన్మాది వీరంగం...ఓ వ్యక్తి మృతి


హైదరాబాదులో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. బంజారా హిల్స్ లోని ఎన్ బీటీ నగర్ లో సైకో కత్తితో కలకలం రేపాడు. ఈ ఉన్మాదిని అడ్డుకునేందుకు వచ్చిన నలుగురిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జానీమియా అనే వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, సైకో కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News