: తెలుగు భాషా బోధనపై జయలలితకు లేఖ రాసిన చంద్రబాబు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషా బోధన రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆమెకు లేఖ రాశారు. తెలుగు భాషను రద్దు చేయడం సరికాదని సూచించారు. తెలుగు భాషను రెండో బోధనా భాషగా ప్రకటించాలని లేఖలో డిమాండ్ చేశారు. తమిళనాట కొనసాగుతున్న తెలుగు మీడియం పాఠశాలలను అలాగే కొనసాగనివ్వాలని ఆయన సూచించారు. తెలుగు భాష రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన లేఖలో కోరారు. కాగా, తమిళ పాఠశాలల్లో తెలుగు భాష బోధన రద్దుపై అక్కడ ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళ ప్రభుత్వ నిర్ణయంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆందోళన నిర్వహించాలని భావించి, రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.