: తమన్నా, శ్రుతి హాసన్ ల 'నిద్ర' పురాణం!


తాము పాండాల లాంటోళ్లమని టాలీవుడ్ టాప్ హీరోయిన్లు చెప్తున్నారు. పాండాలు ఎక్కడపడితే అక్కడ, ఆఖరుకు చెట్టుపై కూడా నిద్రపోగలవని తెలుసుకున్న తమన్నా, 'తాను కూడా పాండా లాంటిదాన్నని, ఎక్కడైనా నిద్రపోతాన'ని ట్వీట్ చేసింది. దీనిని చూసిన శ్రుతిహాసన్ 'సేమ్ పించ్' అని రీట్వీట్ చేసింది. 'షూటింగ్ లో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నా నిద్ర ముంచుకొస్తుందని తెలిపింది. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాన'ని శ్రుతి ట్విట్టర్లో తెలిపింది. దీనికి తమన్నా 'మీ టూ' అంటూ మళ్లీ సమాధానమిచ్చింది. వీరి నిద్ర సంభాషణ వారి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News