: హువాయ్ కంపెనీ ఫిట్ నెస్ బ్యాండ్ ధర రూ.5,499


హువాయ్ కంపెనీ ఫిట్ నెస్ బ్యాండ్ ను ఈరోజు భారత్ లో విడుదల చేసింది. ఆనర్ బ్యాండ్ జెడ్1 పేరుతో విడుదలైన ఈ బ్యాండ్ ఈ నెలాఖరుకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 1.06 అంగుళాల సర్కిల్ డిస్ ప్లే గల ఈ ఫిట్ నెస్ ను చేతికి ధరిస్తే మన ఫిట్ నెస్ పై పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది ధరించిన వ్యక్తి నడిచిన దూరం, నిద్రపోయిన సమయం గుర్తించడమే కాదు, ఎన్ని కేలరీలు ఖర్చు పెట్టామో కూడా తెలియజేస్తుంది. బ్యాండ్ చార్జింగ్ మూడురోజుల పాటు ఉంటుంది. బ్లూటూత్ సౌకర్యం కూడా దీనికి ఉంది. నలుపు, తెలుపు రంగుల్లో లభించే ఈ ఫిట్ నెస్ బ్యాండ్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లతో అనుసంధానం చేసుకోవచ్చు. హువాయ్ కంపెనీ ఆనర్ 7 మోడల్ స్మార్ట్ ఫోన్ ను కూడా ఈరోజే విడుదల చేసింది.

  • Loading...

More Telugu News