: మహిళ గొంతు కోసి, బంగారు ఆభరణాలు చోరీ
మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...స్థానిక గిర్మాజీ పేటకు చెందిన జ్ఞానేశ్వరి అనే మహిళ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఆమె గొంతు కోసి, ఇంట్లో దాచిపెట్టుకున్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ సంఘటన గిర్మాజీపేటలో సంచలనం సృష్టించింది.