: వచ్చే ఏడాది అంతరిక్షంలోకి ఫేస్ బుక్ శాటిలైట్


ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ అంతరిక్షంలోకి శాటిలైట్ పంపబోతోంది. 2016 ద్వితీయార్థంలో ఓ ప్రత్యేక జియోసెంట్రిక్ శాటిలైట్ ను ప్రయోగిస్తున్నట్టు ఈ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తన ఎఫ్ బీ ఖాతాలో స్వయంగా వెల్లడించారు. శాటిలైట్ కోసం స్పేస్ కామ్, యూటెల్ శాట్ సంస్థలతో కలసి 'ఆమోస్-6' అనే శాటిలైట్ ను అభివృద్ధి చేస్తున్నట్టు జుకర్ తెలిపారు. 'ఇంటర్నెట్ డాట్ ఆర్గ్' స్కీమ్ కింద ఈ శాటిలైట్ ను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ శాటిలైట్ ప్రయోగంవల్ల దక్షిణాఫ్రికాలోని మారుమూల ప్రాంతాలకు కూడా రోదసీ నుంచి ఇంటర్నెట్ సర్వీసులు తేలికగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే ఉచిత నెట్ సర్వీసు కాకుండా తక్కువ ఖర్చులో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రజలకు అందుబాటులో తేవడమే తమ లక్ష్యమని అన్నారు. అవసరమైతే ఇతర గ్రహాలకు కూడా నెట్ తరంగాలను పంపించడం తమ లక్ష్యమని అన్నారు.

  • Loading...

More Telugu News