: ఎన్డీయే ప్రధాన ప్రచారకర్తను నేనే: జితన్ రాం మాంఝీ
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున ప్రధాన ప్రచారకర్తను తానేనని హిందుస్థాన్ ఆవామ్ మోర్చా (ఎస్) అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ తెలిపారు. ఎన్డీయే కూటమి తమకు 40 సీట్లు ఇచ్చి ఉంటే 35 స్థానాల్లో విజయం సాధించి చూపేవాడినని ఆయన చెప్పారు. తనను పేద ప్రజలంతా ఎంతో ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా, ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటులో బాగంగా ఆయన పార్టీ హెచ్ఎఎం (హెచ్) కి 21 సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.