: ‘పాక్’ గజల్ సింగర్ భారత్ వస్తే ఊరుకోం: శివసేన హెచ్చరిక


పాకిస్థాన్ తో భారత్ కుదుర్చుకున్న అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేయాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ నెల 9వ తేదీన పాకిస్థాన్ గజల్ సింగర్ గులాం అలీ కన్సర్ట్ ఒకటి మన దేశంలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ ఈ ప్రకటనలు చేసింది. ఈ కన్సర్ట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించేందుకు వీల్లేదంది. శివసేకు చెందిన సినిమా విభాగం చిత్రపథ్ సేన ఈ విషయమై ఇప్పటికే సంబంధిత శాఖాధికారులను కలుసుకుంది. గజల్ సింగర్ గులాం అలీ కార్యక్రమాన్ని రద్దు చేయని పక్షంలో తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. చిత్రపథ్ సేన ప్రధాన కార్యదర్శి అక్షయ్ బద్రాపుర్కార్ మాట్లాడుతూ, ‘పాకిస్థాన్ తో కలిసి భారత్ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడాన్ని మేము వ్యతిరేకిస్తాము. మన జవాన్లను పొట్టనబెట్టుకుంటున్న ఆ దేశంతో మనకు ఎటువంటి సాంస్కృతిక ఒప్పందాలు వద్దు. వాళ్లు మనకు వ్యతిరేకులు. అటువంటప్పుడు పాక్ గాయకులను ఇక్కడికి ఎందుకు అనుమతించాలి’ అంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News