: వామపక్షాల బంద్ కు మద్దతు ప్రకటించిన నాగం
ఈ నెల 10న వామపక్షాలు చేయబోయే తెలంగాణ బంద్ కు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఏకం కావడం సంతోషకరమని చెప్పారు. అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, సొంత డబ్బా కొట్టుకుంటోందని నాగం విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.