: హిందువులకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేశారు: సాధ్వీ ప్రాచి


హిందువులకు చెడ్డ పేరు తెచ్చేందుకు ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ కుట్ర పన్నారని బీజేపీ నాయకురాలు సాధ్వీ ప్రాచి ఆరోపించారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనికోసం ఆయన రూ. కోటి ఖర్చు చేశారని విమర్శించారు. దాద్రీ బాధిత కుటుంబాన్ని చిత్ర హింసలకు గురి చేశారని... తప్పుడు ఆరోపణలు చేయించారని ఫైర్ అయ్యారు. ఆవు మాంసం తిన్నారనే ఆరోపణలతో అఖ్లాక్ అనే వ్యక్తిని కొందరు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. అతని కుటుంబాన్ని కలిసేందుకు నేడు ఆమె వెళ్లారు. ఆమెను అడ్డుకున్న పోలీసులు, ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతించాలని జిల్లా కలెక్టర్ ను కోరానని... అయినప్పటికీ అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News