: 'మాయాబజార్' ల్యాప్ టాప్... ఆ ఘనత భారతీయులదేనంటున్న రిషి కపూర్
ప్రపంచంలో మొదటి ల్యాప్ టాప్ భారతీయులదేనని బాలీవుడ్ నటుడు రిషి కపూర్ అంటున్నారు. ఇందుకాయన తెలుగు జానపద చిత్రం 'మాయాబజార్'లోని ఓ సన్నివేశాన్ని సరికొత్తగా వివరించారు. తెలుగులో అఖండ విజయం సాధించిన ఈ సినిమాలో శశిరేఖ (సావిత్రి) కోసం 'ప్రియదర్శిని' అనే ప్రత్యేక బహుమానాన్ని అభిమన్యుడు పంపుతాడు. అది పెట్టె ఆకారంలో ఉంటుంది. దానిని తెరవగానే అభిమన్యుడు (నాగేశ్వరరావు) తెరపైన పాటపాడుతూ కనిపిస్తాడు. నాటి ఆ పెట్టె చూస్తే అచ్చం ప్రస్తుత ల్యాప్ టాప్ పోలి ఉంటుందని రిషి ట్విట్టర్ లో చెబుతున్నారు. అంటే 1952లో ఆ చిత్రం వచ్చినప్పటికే మనవాళ్లు ఇంటర్నెట్, వైఫైలతో ల్యాప్ టాప్ నమూనాను కనుగొన్నారని రిషి వివరిస్తున్నారు. అందుకు నిదర్శనం ఇదే అంటూ మాయాబజార్ లోని ఆ పాట వీడియో క్లిప్ ను రిషి తన ఖాతాలో షేర్ చేశారు.