: ఆటను ఆస్వాదించేంత వరకు ఆడతా: యువీ
ఆటను ఆస్వాదించినంత వరకు క్రికెట్ ఆడతానని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ లీగ్ లో ఆడే సందర్భంగా యువీ మాట్లాడుతూ, భారత జట్టులో స్థానం సంపాదించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నాడు. ప్రపంచకప్ ప్రత్యేకమైనదని యువీ తెలిపాడు. అది వన్డే వరల్డ్ కప్ అయినా, టీట్వంటీ వరల్డ్ కప్ అయినా ప్రత్యేకమేనని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది టీట్వంటీ సిరీస్ జరగనున్న నేపథ్యంలో తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యమని యువీ తెలిపాడు. టీట్వంటీ వరల్డ్ కప్ ఆడే జట్టులో లో చోటు దక్కించుకుంటానని యువీ విశ్వాసం వ్యక్తం చేశాడు.