: తన డిమాండ్ ను మరోసారి వినిపించిన ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల
హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల. నేడు మరోసారి ఆమె తన డిమాండ్ ను వినిపించారు. 2006లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తాను చేపట్టిన దీక్షకు సంబంధించి కోర్టులో నేడు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా, ఈశాన్య రాష్ట్రాల్లో అమలవుతున్న 'సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం'ను ఉపసంహరించి తీరాల్సిందే అని ఆమె డిమాండ్ చేశారు. మణిపూర్ లో సైనికులు అత్యంత దారుణాలకు ఒడిగడుతున్నారని కోర్టుకు ఆమె తెలిపారు. తాను చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడం ద్వారా... తన ప్రాథమిక హక్కును కాలరాశారని ఆరోపించారు. దీక్ష వల్ల తనకెలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వైద్యానికి తాను సహకరించడం లేదన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. గత 15 సంవత్సరాలుగా ఇరోమ్ షర్మిల నిరాహారదీక్ష చేస్తూనే ఉన్నారు.