: భోగాపురంలో నాకు భూమి ఉందని జగన్ నిరూపించాలి: మంత్రి గంటా సవాల్
విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు భూమి సేకరణ విషయంలో వైఎస్ జగన్ చేసిన ఆరోపణలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. భోగాపురంలో తనకు సెంట్ భూమి ఉందని జగన్ నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. లేకపోతే జగన్ తప్పుకుంటారా? అని సవాల్ చేశారు. వైఎస్ హయాంలో కంపెనీల కోసం వేల ఎకరాల భూములు దోచుకున్న వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకే ఇలా అర్థంలేని విమర్శలు చేస్తున్నాడని అన్నారు. జగన్ అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారని విమర్శించారు.