: బీహార్ లో విజయం లౌకిక కూటమిదే: రాహుల్ గాంధీ


బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో లౌకిక కూటమిదే విజయమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. బీహార్ లోని బెగుసరాయ్ లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి ద్వేషం వెదజల్లడమే తెలుసని అన్నారు. తమకు ప్రేమను పంచడం తెలుసని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని ఆయన చెప్పారు. ఫేస్ బుక్, ట్విట్టర్ కాలం వెళ్లబుచ్చుతున్న మోదీకి రైతుల సమస్యలు కనపడడం లేదని విమర్శించారు. బీహార్ లో తమ లౌకిక కూటమి విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News