: పట్టపగలే వృద్ధ దంపతులపై దాడి: బంగారం అపహరణ
పట్టపగలే వృద్ధ దంపతులపై దొంగలు దాడి చేసి బంగారం దోచుకెళ్లిన సంఘటన మెదక్ జిల్లాలో ఈరోజు జరిగింది. ఈ సంఘటన వివరాలు...కొండపాక మండలం బండారు శివార్లలో వృద్ధ దంపతుల నివాసం ఉంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న సుమారు 3 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. బుధవారం నాడు జరిగిన ఈ సంఘటనపై మృతుల కుటుంబీకులు, బంధువులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు, సంగారెడ్డి మొదలైన ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నప్పటికీ పోలీసుల గస్తీ కొరవడిందని కొంతమంది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.