: ఘోర రోడ్డు ప్రమాదం... లారీ-ఆర్టీసీ బస్సు ఢీ... 10 మంది దుర్మరణం


నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ - ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎదురెదురుగా వస్తున్న క్రమంలో, ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటన, జిల్లాలోని రామన్నపేట మండలం ఇంద్రపాల్ నగరం వద్ద చోటు చేసుకుంది. రెండు వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు భువనగిరి నుంచి నల్గొండ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

  • Loading...

More Telugu News