: బాబు కార్యాలయానికి విషం సీసాతో వచ్చిన మహిళ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయానికి ఓ మహిళ విషం సీసాతో వచ్చి కలకలం రేపింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ చేతిలో విషం సీసాతో సీఎం కార్యాలయానికి చేరుకుంది. దీనిని గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకుని, పాయిజన్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎంకు వివరించారు. దీంతో ముఖ్యమంత్రి ఆమె సమస్యను తెలుసుకున్నారు. స్థానిక టీడీపీ నేత తన నివాసాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని ఆమె సీఎంను కోరారు. దీంతో సమస్యను పరిష్కరిస్తానని బాబు ఆమెకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News