: బాలాపూర్ కూడలి వద్ద పగిలిన పైప్ లైన్
రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ కూడలి వరదనీటిని తలపించే నీటి ప్రవాహంతో నిండిపోయింది. కృష్ణా పైప్ లైన్ పగిలిపోవడంతో విపరీతంగా నీరు వృథాగా పోతోంది. పలువాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల్లోకి కూడా ఈ నీరు చేరింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పాదచారులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, పైప్ లైన్ పగిలిపోవడంతో బయటకు అడుగుపెట్టడం కుదరలేదని, ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని అన్నారు.