: ఖైరతాబాద్ సర్కిల్ ట్రాఫిక్ విధుల్లో మందుబాబులు
ఖైరతాబాద్ సర్కిల్ లో మందుబాబులు ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారమెత్తారు. గత రాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు ఎర్రమంజిల్ లోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. వారిని విచారించిన న్యాయస్థానం వారిని ఖైరతాబాద్ సర్కిల్ లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో కలిసి పని చేయాలని సూచించింది. అలాగే 9,500 రూపాయల జరిమానా కూడా విధించింది. దీంతో వారంతా నేటి ఉదయం ఖైరతాబాద్ సర్కిల్ లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లుగా వ్యవహరించారు.