: ఆదాయపు పన్ను బకాయిల్లో విజయ్!


'పులి' అంటూ వెండితెరపైకి దూసుకొచ్చిన తమిళ నటుడు విజయ్ గడచిన ఐదు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లించడం లేదట. చెన్నై ఐటీ అధికారుల సమాచారం ప్రకారం, 2010 నుంచి ఆయన చాలా వరకు పన్ను ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల పలువురు దక్షిణాది నటీనటుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వారిలో విజయ్ కూడా ఉన్నాడు. వీరందరికీ సంబంధించి రూ. 25 కోట్ల పన్ను బకాయిల రూపంలో రావాల్సి వుందని ఐటీ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, తాను ఆదాయపు పన్ను చెల్లించడం లేదని వచ్చిన వార్తలను ఖండించిన విజయ్, టాక్స్ లన్నీ సక్రమంగా చెల్లించానని, ఈ సంవత్సరం పన్ను కూడా ముందుగానే కట్టేశానని తెలిపాడు.

  • Loading...

More Telugu News