: చంద్రబాబుపై ఒత్తిడి తెస్తేనే... కేంద్రంపై ఒత్తిడి వస్తుంది: జగన్


ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తే, ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారనే ఉద్దేశంతోనే దీక్షను చేపడుతున్నట్టు వైకాపా అధినేత జగన్ అన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని గతంలో ప్రతి సమావేశంలో చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో సైతం దీక్ష చేపట్టామని గుర్తు చేశారు. హైదరాబాద్ లో 90 శాతం ఐటీ సంస్థలు, 70 శాతం పరిశ్రమలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో, ఏపీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని... కానీ, ఆనాడు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మాత్రం మరిచిపోయారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఉంచిన హామీలన్నింటినీ టీడీపీ తుంగలో తొక్కిందని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని... ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న పిల్లలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News