: రైతులకు కాదు... నీ అభిమానులకు చెప్పుకో!: పవన్ పై వర్మ ఘాటు వ్యాఖ్యలు


తాను చనిపోయినట్టుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారం గురించి తెలుసుకున్న రాంగోపాల్ వర్మ కాస్తంత ఘాటుగానే స్పందించారు. "పవన్ కల్యాణ్... రైతుల కోసం పనిచేయడం మానేసి ఆయన అభిమానుల కోసం పనిచేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే రైతులు ఆయన సినిమా టికెట్లను ఎన్నడూ కొనరు" అని వ్యాఖ్యానించారు. అంతకుముందు తన ఫోటోకు పూలమాల వేసి వున్న చిత్రాన్ని షేర్ చేస్తూ, "నేను మహేశ్ బాబు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంగ్లీషులో ఉన్న నా ట్వీట్లను అనువదించి చదువురాని, సాంకేతకత తెలియని వారికి పంపండి" అన్నాడు. తాను పవన్ కల్యాణ్ కు మెగా పవర్ ఫ్యాన్ నని వెల్లడించిన ఆయన, పవన్ ఫ్యాన్స్ కనీసం మహేశ్ అభిమానులను చూసైనా నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. "మీరు నన్ను చంపొచ్చు. నా ఆలోచనలను చంపలేరు. నిరక్షరాస్యులకు, టెక్నాలజీ పరంగా అవిటివారికీ ఇది అర్థం కాదు" అని కూడా అన్నాడు. వర్మ వ్యాఖ్యలతో ఈ వివాదం ఇంకెంత ముదురుతుందో?!

  • Loading...

More Telugu News