: ఆర్ఎస్ఎస్ కంటే రాందేవే కరుడుగట్టిన హిందుత్వవాది: లాలూ


బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్న యోగా గురువు బాబా రాందేవ్ పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాటల దాడి మొదలెట్టారు. ఆర్ఎస్ఎస్ కంటే ఆయనే ప్రమాదకరమని విమర్శించారు. రాందేవ్ ఆర్ఎస్ఎస్ ను మించిన కరుడుగట్టిన హిందుత్వవాది అని వ్యాఖ్యానించారు. ఆయన తయారుచేసే ఔషధాల్లో పశువుల ఎముకలు కలుపుతున్నారని సీపీఎం నేత బృందా కారత్ అన్న విషయాన్ని లాలూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటప్పుడు పశువుల ఎముకలైనా, మనిషి ఎముకలైనా తేడా ఏముందని అడిగారు. బీహార్ లో ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, నల్లధనం విషయంలో రాందేవ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాబా సాధువు కాదని, సొంత పనులు చక్కబెట్టుకునే వ్యక్తని విమర్శించారు. రాందేవ్ అమ్ముతున్న మందుల వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని లాలూ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News