: రాంగోపాల్ వర్మపై పవన్ ఫ్యాన్స్ వినూత్న ప్రతీకారం!
కొద్దిరోజుల క్రితం పవన్ అభిమానులు చదువుకోని వారు, టెక్నాలజీ గురించి తెలియని వారు అంటూ, దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై పవర్ స్టార్ ఫ్యాన్స్ వినూత్న ప్రతీకారం తీర్చుకున్నారు. వర్మపై ఎటాక్ చేస్తూ, 'హటాత్తుగా మరణించిన రాంగోపాల్ వర్మ' అన్న హెడ్డింగుతో ఓ ఫొటోను తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచి 'రిప్' (రెస్ట్ ఇన్ పీస్) మీద 'రిప్' కొడుతూ తమ పగ తీర్చుకుంటున్నారు. ఇదే చిత్రంలో పూల దండల మధ్య వర్మ చిత్రం పెట్టి, పక్కనే దీపం కూడా పెట్టేశారు. దాని పక్కనే ఓ మృతదేహాన్ని ఉంచారు. అంతేకాదు, "సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్న పలు సినీ ప్రముఖులు, ఆనంద బాష్పాలతో వీడ్కోలు చెప్తూ... నివాళులు అర్పిస్తున్న సినీ ప్రపంచం..." అంటూ వ్యాఖ్యలు రాశారు. ఇప్పుడీ చిత్రాలను పవన్ కల్యాణ్ ఫాన్స్ షేర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడీ చిత్రం సోషల్ మీడియాలో శరవేగంగా విస్తరిస్తూ దూసుకెళ్తోంది.