: జగన్ దీక్షలో చిత్తశుద్ధి లేదు: మంత్రి కామినేని


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షలో చిత్తశుద్ధి లేదని మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు. కేవలం ఉనికి కోసమే దీక్ష చేపట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉండి పాలన సాగిస్తున్నారని, జగన్ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటూ అప్పుడప్పుడు విజయవాడ వెళ్లి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయవాడలో మంత్రి మాట్లాడారు. ప్రత్యేక హోదా కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. హోదాతో పాటు విభజన హామీలను కూడా అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాపై బీజేపీ హామీ ఇచ్చింది కాబట్టి, దాన్ని నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News