: నిండుకుండలా సుంకేసుల... పొంగి పొరలుతున్న కుందూ


కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయం నిండుకుండలా మారింది. జలాశయం పూర్తిగా నిండిపోగా, 15 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఒక మీటరు మేరకు ఎత్తి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ఇదిలావుండగా, ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు కర్నూలు జిల్లాలో కుందూ నది పొంగి పొరలుతుండగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజోలి ఆనకట్ట వద్ద గత రాత్రి 3,606 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నేటి ఉదయం అది 6,861 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రానికి వరద మరింతగా పెరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News