: అంత సీను లేదు: భారత వృద్ధిని మరోసారి తగ్గించిన ఐఎంఎఫ్


అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 2015-16లో 7.3 శాతానికి కుదించింది. అంతకుముందు జూలైలో జీడీపీ వృద్ధి 7.5 శాతమని అంచనా వేసిన ఐఎంఎఫ్, దాన్ని మరింతగా తగ్గించడానికి కారణం... అనుకున్న విధంగా సంస్కరణల అమలు జరగకపోవడం, విదేశీ పెట్టుబడులు రాకపోవడమేనని వెల్లడించింది. అలాగే 2016-17 ఆర్థిక సంవత్సరంలో కూడా వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండవచ్చని అభిప్రాయపడింది. ఆర్థిక విధానాల్లో మార్పులు, పెట్టుబడుల తీరు తదితర అంశాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని పేర్కొంది. అయితే, భారత్ అనుసరిస్తున్న ఆర్థిక వ్యూహాలు అభవృద్ధికి అనుకూలంగానే ఉన్నాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. కాగా, పెరులోని లిమాలో జరుగుతున్న ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ సమావేశంలో ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఐఎంఎఫ్ తన నివేదికను సమర్పించింది.

  • Loading...

More Telugu News