: కల్తీ కల్లు తాగే చనిపోయారన్నది అవాస్తవం: మంత్రి పద్మారావు


తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అనేక మంది కల్తీ కల్లు బారినపడి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే కల్తీ కల్లు తాగి అనేక మంది మరణించారన్నది అవాస్తవమని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. దానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నారు. కల్లుకు బానిసలై మాత్రమే చనిపోయినట్టు సమాచారం ఉందని శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. గౌడ్ ల సంక్షేమం, కల్తీ కల్లు నివారణపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఆధునిక వసతుల అంశంపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. కల్లు సంఘాలకు స్థలం కేటాయింపు పరిశీలనలో ఉందన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున, అంగవైకల్యంతో ఉన్న గీతకార్మికులకు రూ.50వేల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు తెలిపారు. గీత కార్మికులకు పెన్షన్ ను రూ.200 నుంచి రూ.1000కి పెంచామన్నారు.

  • Loading...

More Telugu News