: బీహార్ లో అక్బరుద్దీన్ ఒవైసీపై అరెస్ట్ వారెంట్ జారీ
ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై బీహార్ లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల కిందట నిర్వహించిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఒవైసీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కిషన్ గంజ్ ఎస్పీ రాజీవ్ రాజన్ వారెంట్ ఇచ్చారు. ఒవైసీ ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని ఎస్పీ తెలిపారు. అంతకుముందు అక్బర్ పై కేసు కూడా నమోదు చేశారు. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.