: పాకిస్థాన్ గుండెల్లో వణుకు పుట్టించే వార్త... ప్రపంచంలో 'టాప్-5' సైనిక శక్తి భారత్ దే: క్రెడిట్ సూస్


భారత చిరకాల శత్రువు పాకిస్థాన్ గుండెల్లో వణుకు పుట్టించే వార్త ఇది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిని కలిగివున్న దేశాల జాబితాను ప్రముఖ రీసెర్చ్ అండ్ రేటింగ్ సంస్థ క్రెడిట్ సూస్ ప్రకటించగా, ఇండియా అందులో ఐదవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 0.94 పాయింట్ల స్కోర్ తో అమెరికా మొదటి స్థానంలో నిలువగా, ఆపై వరుసగా రష్యా (0.8), చైనా (0.79), జపాన్ (0.72), ఇండియా (0.69), ఫ్రాన్స్ (0.61), సౌత్ కొరియా (0.52), ఇటలీ (0.52), బ్రిటన్ (0.52), టర్కీ (0.47) నిలిచాయి. ఈ జాబితాలో పాకిస్థాన్ 11వ స్థానంలో ఉందని క్రెడిట్ సూస్ నివేదిక వెల్లడించింది. మొత్తం 13,900 యుద్ధ విమానాలు, 920 యుద్ధ హెలికాప్టర్లు, 20 విమాన వాహక నౌకలు, 72 సబ్ మెరైన్లను కలిగిన అమెరికా 2014లో రక్షణ రంగానికి 610 బిలియన్ డాలర్లను కేటాయించి, ఈ విభాగంలో తిరుగులేని దేశంగా నిలిచిందని తెలిపింది. ప్రపంచంలోని అణుశక్తిలో 90 శాతం రష్యా, అమెరికాల వద్దే ఉందని పేర్కొంది. కాగా, భారత్ తమతో ఏ తరహా యుద్ధ మార్గంలో తలపడినా, తాము సమర్థవంతంగా సమాధానం చెప్పగలమని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రషీష్ షరీఫ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News