: దీక్ష చేసే ముందు జగన్ అక్రమాస్తులు ప్రభుత్వానికివ్వాలి: ఎమ్మెల్యే నిమ్మల
ప్రత్యేక హోదాకై ఈ రోజు నుంచి గుంటూరులో దీక్ష చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్... ముందు తన అక్రమాస్తులను ప్రభుత్వానికి ఇవ్వాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. వాటితో రాష్ట్రంలోని డ్వాక్రా రుణాల మాఫీ, నూతన రాజధాని నిర్మాణంలో ఆయన సహకారం ఉంటుందని చెెెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఈ మేరకు డిమాండ్ చేస్తూ, మహిళలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల ఆధ్వర్యంలో పాలకొల్లు నుంచి నరసాపురం వరకు మహిళలు, టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నారు.