: అమితాబ్ ను చూస్తూ, 4 కి.మీ వెంటవచ్చిన పెద్దపులి!
ముంబై నడిబొడ్డున ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. అక్కడ ఎన్నో షూటింగులు జరిగాయి. అమితాబ్ బచ్చన్ సైతం ఎన్నోమార్లు అక్కడకు వెళ్లి వచ్చాడు. ఎప్పుడూ ఎదురుకాని వింత అనుభవం ఈ దఫా ఎదురైంది. ఓ పెద్దపులి ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని నాలుగు కిలోమీటర్ల దూరం వెంబడించింది. సాధారణంగా పులులు ఇలా ఎన్నడూ చేయవు. కానీ, ఈ సారి పలుమార్లు ఆయన్ను చూస్తూ ఆ పులి వెంబడించడం, ఆ చిత్రాలను అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టడంతో, ఇప్పుడా చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఘటనను మరచిపోలేనిదిగా అభివర్ణించిన అమితాబ్, 45 సంవత్సరాలుగా ముంబైలో నివసిస్తున్న తనకు ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని వ్యాఖ్యానించారు.