: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈసారి తుళ్లూరులో
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈసారి రాజధాని అమరావతి కేంద్రంగా జరగబోతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరులో భూమి పూజ జరిగిన ప్రదేశంలో సమావేశాలను నిర్వహించనున్నారు. డిసెంబర్ చివరివారంలో ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల ఏర్పాట్ల బాధ్యతలను ఓ కన్సల్టెన్సీకి అప్పగించాలని ప్రతిపాదించారు. ఇక హాయ్ ల్యాండ్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ అతిథిగృహాల్లో ఎమ్మెల్యేలకు నివాస ఏర్పాట్లు చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపాదన చేయగా, సీఎం చంద్రబాబు అంగీకరించారు. అంతేగాక అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు లేదా తరువాత రోజున యోగా గురువు బాబా రాందేవ్ ఎమ్మెల్యేలకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారట.