: అమెరికన్లు కూడా క్రికెట్ బ్యాట్ పట్టాలి: సచిన్


క్రికెట్ చూడటానికి అమెరికన్లు స్టేడియంలకు తరలి రావాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చారు. ఒకసారి క్రికెట్ చూస్తే, వారుకూడా ఆటను ఇష్టపడతారని, మ్యాచ్ లను ఫాలో అవుతారని తెలిపారు. అమెరికన్లు క్రికెట్ ను ఆస్వాదిస్తుంటే చూడాలనేది తన కోరిక అని చెప్పారు. బేస్ బాల్ బ్యాట్లతో పాటు క్రికెట్ బ్యాట్లను కూడా అమెరికన్లు పట్టాలని అభిలషించారు. వసీం అక్రమ్, షేన్ వార్న్, జాక్ కలిస్, మహేల జయవర్దనేలాంటి క్రికెట్ దిగ్గజాలతో కలసి అమెరికాలో సచిన్ టీ20 మ్యాచ్ లు ఆడనున్నారు. ఇప్పటికే అమెరికాలో సచిన్ ప్రాక్టీస్ ప్రారంభించారు. మాజీ క్రికెట్ దిగ్గజాలంతా కలసి యూఎస్ లో మూడు టీ20లు ఆడనున్నారు.

  • Loading...

More Telugu News