: తిరుమల రెండో ఘాట్ రోడ్ బంద్
తిరుమల రెండో ఘాట్ రోడ్ మూతపడింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. రోడ్డులో మరమ్మత్తులు చేసేందుకే బంద్ చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో, లింక్ రోడ్డు నుంచి మొదటి ఘాట్ రోడ్డులోకి వాహనాలను మళ్లిస్తున్నారు. నిన్న రెండో ఘాట్ రోడ్డులో బండరాళ్లు విగిరిపడ్డాయి. దీంతో, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రేన్ల సహాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రెండో ఘాట్ రోడ్డులో వాహన రాకపోకలను మళ్లీ పునరుద్ధరిస్తారు.