: కేసీఆర్ చరిత్ర హీనుడు: ఎల్.రమణ నిప్పులు
అసెంబ్లీలో విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలను అణచాలని చూడటం కేసీఆర్ బలహీనతని విమర్శించారు. బీజేపీతో కలసి తాము చేపట్టిన నిరసనలు కొనసాగుతాయని, హన్మకొండ నుంచి జరిగే పాదయాత్ర ఆత్మకూరు వరకూ సాగుతుందని తెలిపారు. తాము రైతుల కోసం చేపట్టిన బంద్ విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని రమణ వ్యక్తం చేశారు.