: నివేదికలు ఇవ్వకుండా డబ్బెలా ఇస్తాం?: ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పురందేశ్వరి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం అందించడం లేదన్న విమర్శలను బీజేపీ నేత పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకూ రాజధాని మాస్టర్ ప్లాన్, డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు రిపోర్టులను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపలేదని, ఇక నిధులను ఎలా కేటాయిస్తామని ఆమె ప్రశ్నించారు. ఏపీ సర్కారు చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల, భోగాపురం విమానాశ్రయాల ప్రాజెక్టులపై బీజేపీకి కొన్ని అనుమానాలున్నాయని ఆమె అన్నారు. తమ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన ఆమె, రాష్ట్రానికి హోదా రాకపోయినా, దానికి సమానమైన అవకాశాలను దగ్గర చేయాలని భావిస్తున్నామని తెలిపారు.