: ఇక ‘శ్రీచైతన్య’ వంతు... కర్నూలులో కార్పొరేట్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య


తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమైతే, మరోవైపు కార్పొరేట్ కళాశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్న ఘటనలూ కలకలం రేపుతున్నాయి. నిన్నటిదాకా నారాయణ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలి బ్రాంచ్ లతో దూసుకుపోతున్న మరో కార్పొరేట్ కళాశాల శ్రీ చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థి ఉరేసుకుని తనువు చాలించాడు. కర్నూలులోని కృష్ణా నగర్ కు చెందిన విద్యార్థి జగదీశ్ నగరంలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. నేటి ఉదయం అతడు తన ఇంటిలో ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News