: బెజవాడకు బయలుదేరిన వైసీపీ అధినేత... రోడ్డు మార్గాన్ని ఎంచుకున్న జగన్
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ చేపట్టనున్న నిరవధిక దీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దీక్ష కోసం కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి జగన్ విజయవాడ బయలుదేరారు. హైదరాబాదు నుంచి విమానంలో జగన్ గన్నవరం చేరుకుంటారని భావించినా, ఆయన మాత్రం రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి జగన్ రోడ్డు మార్గం మీదుగా విజయవాడ బయలుదేరారు. విజయవాడలో కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత గుంటూరు పరిధిలోని నల్లపాడులో ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి చేరుకుంటారు.