: కత్తి పద్మారావు ఆధ్వర్యంలో ‘నవ్యాంధ్ర’ పేరిట మరో రాజకీయ పార్టీ


ఏపీలో అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ... రెండు కూడా కులాల పార్టీలేనని దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావు ఆరోపించారు. ఈ రెండు పార్టీల్లో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి అంతగా ప్రాధాన్యం దక్కదని కూడా ఆయన చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ఆయా వర్గాల జనాభా ప్రతిపాదికన న్యాయం చేయాలంటే కొత్త పార్టీ పెట్టాల్సిందేనని పద్మారావు పేర్కొన్నారు. ఆ పనిని తానే చేస్తున్నానని ఆయన నిన్న ప్రకటించారు. వచ్చే నెల 1న ‘నవ్యాంధ్ర’ పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. తాను ఏర్పాటు చేస్తున్న పార్టీలో ఆయా సామాజికవర్గాలకు వారి జనాభా దామాషా పద్ధతిన సీట్లను కేటాయిస్తామని పద్మారావు ప్రకటించారు.

  • Loading...

More Telugu News