: భారత్ లో దూసుకుపోతున్న ఫేస్ బుక్


భారత్ లో ఫేస్ బుక్ దూసుకుపోతోంది. 51 శాతం యూజర్లతో ఫేస్ బుక్ భారత్ లో విశేషమైన ఆదరణ పొందుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే 56 శాతం యూజర్లతో వాట్స్ యాప్ కు కూడా అత్యంత ఆదరణ ఉందని 'కనెక్టెడ్ లైఫ్' పేరిట అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్ఎస్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 50 దేశాలకు చెందిన 60,500 మంది యూజర్ల మనస్తత్వం, ప్రవర్తనలపై అధ్యయనం జరిగింది. సోషల్ మార్కెట్ వ్యాపారం మొత్తం ఫేస్ బుక్ ఆధారంగా సాగుతోందని, ఫేస్ బుక్ లో వ్యక్తిగత సందేశాలు భారీ ఎత్తున ఉంటున్నాయని ఈ పరిశోధన తెలిపింది. ఇన్ స్టెంట్ మెసేజింగ్ లో మాత్రం వాట్స్ యాప్ దే పైచేయి అని పరిశోధన చెప్పింది. ఇదే ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే 30 శాతం యూజర్లతో ఫేస్ బుక్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఆసియా ఫసిఫిక్ దేశాల్లో ఫేస్ బుక్ యూజర్లు ఎక్కువగా ఉండడం విశేషం. భారత్ లో 51 శాతం ఉంటే, థాయ్ లాండ్ లో 78 శాతం, తైవాన్ లో 72శాతం, హాంగ్ కాంగ్ లో 72 శాతం మంది ప్రతి రోజూ ఫేస్ బుక్ వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News