: రైతు ఆత్మహత్యలు ఆందోళన కల్గిస్తున్నాయి: ఏపీ సీఎం చంద్రబాబు


రైతులకు రుణాల మంజూరు విషయంలో లక్ష్యాలు సాధించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలని, రైతు సమస్యలకు పరిష్కారాలు సూచించాలని అన్నారు. రైతులకు సూచనలు, సలహాల కోసం ప్రాంతాల వారీగా నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భూసార పరీక్షల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాదిలో 4 లక్షల నమూనాలకు భూసార పరీక్షలు నిర్వహించినట్లు చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News