: ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష భవనంలో పుర్రెలు, ఎముకలు
ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష భవనంలో నిర్మాణ పనులు జరుగుతుండగా మానవ పుర్రెలు, ఎముకలు లభ్యమయ్యాయి. అధ్యక్ష భవనంలోని కాంపౌండ్ లో ఉన్న కిచెన్ లో కార్మికులు నిర్మాణ పనులు చేస్తుండగా ఈ విషయం వెలుగు చూసింది. రెండు మానవ పుర్రెలతో పాటు, ఎముకలు కూడా లభ్యమైనట్టు అధ్యక్ష భవనం అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ పుర్రెలు ఎవరివనే విషయం ఇప్పటికిప్పుడే చెప్పడం కష్టమని అధికారులు చెప్పారు. కాగా, వీటిపై దర్యాప్తునకు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘని ఆదేశించారు.