: పోలీసులతో సమాన హోదా కల్పించండి: ప్రధానికి రక్తంతో లేఖ రాసిన హోంగార్డులు


తమ సమస్యలు పరిష్కరించమంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి హోంగార్డులు రక్తంతో ఒక లేఖ రాశారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని కోటో ప్రాంతంలో జరిగింది. పోలీసులతో సమాన హోదా విషయంలో ఈరోజు అక్కడ హోంగార్డుల సంఘం అధ్యక్షుడు జల్కాన్ సింగ్ ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ జరిగింది. తమ డిమాండ్లను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై వారందరూ కలిసి రక్తంతో ఈ లేఖ రాశారు. తమకు పోలీసులతో సమానంగా హోదా కల్పించాలని ఆ లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News