: పదేళ్ల పిల్లాడు...సరైన సమాధానాలతో 18 నిమిషాల్లో జావా పరీక్ష రాశాడు


పదేళ్ల పిల్లాడికి కంప్యూటర్ గురించి ఎంత తెలుస్తుంది?...మహా అయితే వీడియో గేమ్స్ ఆడేందుకు అవసరమైన పరిజ్ఞానం ఉంటుంది. మనం అలా అనుకుంటే కనుక ఈ బుడతడి విషయంలో తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనకు వయసుకు సంబంధం లేదని నిరూపించాడో పదేళ్ల పిల్లాడు. అహ్మదాబాద్ కు చెందిన రోనిల్ షా (10) స్థానిక యూరో పాఠశాలలో చదువుతున్నాడు. అమెరికాకు చెందిన ఒరాకిల్ కంపెనీ ఇటీవల జావా పరీక్ష నిర్వహించింది. మూడు గంటల నిడివి గల ఈ పరీక్షను కంప్యూటర్ ఇంజనీర్లే కాస్త కష్టమైన పరీక్షగా అభివర్ణిస్తారు. అలాంటి పరీక్షను కేవలం 18 నిమిషాల్లో పూర్తి చేశాడు. అతి తక్కువ సమయంలో పరీక్ష పూర్తి చేయడమే కాకుండా నూటికి నూరు మార్కులు సాధించాడు. రోనిల్ నాలుగేళ్ల వయసప్పుడే కంప్యూటర్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాడని, తరువాత సీ, సీ ప్లస్ ప్లస్, యానిమేషన్ నేర్చుకున్నాడని, ఇప్పుడు రోబోటిక్స్ గురించి నేర్చుకుంటానంటున్నాడని అతని తండ్రి తెలిపారు.

  • Loading...

More Telugu News