: తన చేతకాలేదని కేసీఆర్ ఒప్పుకుంటే...నిధులు తెస్తాం: కిషన్ రెడ్డి


ఎన్నికల హామీలు నెరవేర్చడం చేతకాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ముందు ఒప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతులకు తప్పుడు హామీలు ఇచ్చామని ముఖ్యమంత్రి బహిరంగంగా ఒప్పుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్ల తరువాత నిధులు లేవని చెబుతున్న కేసీఆర్ కు ఎన్నికల ముందు ప్రజలకు, రైతులకు హామీలు ఇచ్చినప్పుడు ఆ విషయం తెలియదా? అని నిలదీశారు. బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను వంచించడం సరికాదని ఆయన చెప్పారు. నిధులు లేకపోతే ఇతర పథకాలు ఎలా చేపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనపడడం లేదా? అని అడిగారు.

  • Loading...

More Telugu News