: రాజీకి నో చెప్పిన లిపికా మిత్రా


ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతితో రాజీకి అతని భార్య లిపికా మిత్రా నిరాకరించారు. దీంతో సోమనాథ్ భారతి చిక్కుల్లో పడ్డారు. ఆమె నిరాకరణతో అతనిపై గృహహింస, హత్యాయత్నం కేసులు కొనసాగనున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు హాజరైన లిపికా మిత్రా తన భర్తతో రాజీకి కానీ, మధ్యవర్తిత్వంలో పాల్గొనేందుకు కానీ సముఖంగా లేనని స్పష్టం చేశారు. దీంతో సోమనాథ్ భారతి బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు ద్వారా బెయిల్ కు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సోమనాథ్ భారతికి సూచించింది.

  • Loading...

More Telugu News